జనవరి 7న మంత్రి జూపల్లి పర్యటన
బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ పట్టణంలో మంగళవారం ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించనున్నట్లు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. నూతనంగా నిర్మించిన ఎక్సైజ్ కార్యాలయం ప్రారంభోత్సవం మరియు అమృత్ 2.0లో భాగంగా పట్టణంలో తాగునీటి సరఫరా పనులకు ఆయన శంకుస్థాపన చేస్తారన్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను, సభాస్థలాన్ని శనివారం పరిశీలించారు. ఆయన వెంట మున్సిపల్ ఛైర్మన్ జంగం గంగాధర్, నాయకులు ఎజాజ్, ఖాలేక్, రమేశ్, నర్ల ఉదయ్, అఫ్రోజ్ తదితరులున్నారు.