వర్షం నేపథ్యంలో వైద్య సిబ్బందికి మంత్రి కీలక సూచలు

హాస్పిటళ్ల సూపరింటెండెంట్లు, ఆర్‌ఎంవోలు, మెడికల్ ఆఫీసర్లు, డాక్టర్లు మూడు రోజులు కచ్చితంగా విధుల్లో ఉండాలి హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణకు మూడు రోజులు వర్ష సూచన నేపథ్యంలో మంత్రి దామోదర రాజనర్సింహ వైద్య సిబ్బందికి కీలక సూచనలు చేశారు. బుధవారం ఉదయం ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి టెలీకాన్ఫరన్స్ లో మాట్లాడారు. హాస్పిటళ్ల సూపరింటెండెంట్లు, ఆర్‌ఎంవోలు, మెడికల్ ఆఫీసర్లు, డాక్టర్లు, సిబ్బంది ఈ మూడు రోజులు కచ్చితంగా విధుల్లో ఉండాలని మంత్రి సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో‌ వచ్చే రోగులకు, గర్భిణులకు తక్షణమే వైద్య‌ సేవలు...