Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 August 2025, 10:21 am Posted by : ramakrishna

వర్షం నేపథ్యంలో వైద్య సిబ్బందికి మంత్రి కీలక సూచలు

హాస్పిటళ్ల సూపరింటెండెంట్లు, ఆర్‌ఎంవోలు, మెడికల్ ఆఫీసర్లు, డాక్టర్లు మూడు రోజులు కచ్చితంగా విధుల్లో ఉండాలి

హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణకు మూడు రోజులు వర్ష సూచన నేపథ్యంలో మంత్రి దామోదర రాజనర్సింహ వైద్య సిబ్బందికి కీలక సూచనలు చేశారు. బుధవారం ఉదయం ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి టెలీకాన్ఫరన్స్ లో మాట్లాడారు. హాస్పిటళ్ల సూపరింటెండెంట్లు, ఆర్‌ఎంవోలు, మెడికల్ ఆఫీసర్లు, డాక్టర్లు, సిబ్బంది ఈ మూడు రోజులు కచ్చితంగా విధుల్లో ఉండాలని మంత్రి సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో‌ వచ్చే రోగులకు, గర్భిణులకు తక్షణమే వైద్య‌ సేవలు అందించాలని, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.  అంబులెన్స్‌లు, 102 వాహనాలు అన్నీ సిద్ధంగా ఉంచుకోవాలని, ఎక్కడ ఎమర్జెన్సీ ఉన్నా తక్షణమే వెళ్లి రోగులను తరలించేలా‌ డ్రైవర్లు, ఈఎంటీలను 24 గంటలు అందుబాటులో ఉంచుకోవాలని అధికారులకు మంత్రి దామోదర్ సూచించారు.