నిజామాబాద్, బతుకమ్మ : దుండగుడి దాడిలో హత్యకు గురైన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబంతో మంత్రి వివేక్ వెంకటస్వామి ఫోన్ లో మాట్లాడారు. ప్రమోద్ భార్య ప్రణీతను పరామర్శించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి భరోసా కల్పించారు. నిజామాబాద్ లో ప్రమోద్ విగ్రహాన్ని తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేయిస్తానని మంత్రి వివేక్ వెంకటస్వామి హామీ ఇచ్చారు.