Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 October 2025, 6:18 pm Posted by : ramakrishna

ఎమ్మెల్యే భూపతి రెడ్డిని పరామర్శించిన మంత్రి వేవిక్ వెంకట స్వామి

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ: నగరంలోని కంటేశ్వర్ బైపాస్  లోగల నిజామాబాద్ రూరల్ క్యాంపు కార్యాలయంలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ శాసన సభ్యులు డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి ని తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వేవిక్ వెంకట స్వామి, వర్ధన్న పేట్ ఎమ్మెల్యే నాగరాజు ఆదివారం పరామర్శించారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ శాసన సభ్యులు డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి మాతృమూర్తి రేకులపల్లి లక్ష్మీ నర్సమ్మ గత నెల 29న మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకట స్వామి,వర్ధన్న పేట్ ఎమ్మెల్యే నాగ రాజు భూపతి రెడ్డిని, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. భూపతి రెడ్డి మాతృమూర్తికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కో ఆపరేటివ్ యూనియన్ చైర్మన్,  డీసీసీ అధ్యక్షులు మానల మోహన్ రెడ్డి,  పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్,పీసీసీ అధికార ప్రతినిధి వేణు యాదవ్,డీసీసీ ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి, సీనియర్ నాయకులు భోజన్న, ఉమ్మాజీ నరేష్,ఎ ఎం సీ భాగరెడ్డి, మాజీ సర్పంచ్ మోహన్, నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, సొసైటీ చైర్మన్లు, డైరెక్టర్లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అధికారులు మరియు పలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Minister Vevik Venkataswamy visits MLA Bhupathi Reddy