. . . రూ.5 కోట్లతో నిర్మించిన ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాలేజీ భవన ప్రారంభోత్సవం
ఇందల్వాయి, బతుకమ్మ :
ఇందల్వాయి మండల కేంద్రంలోని తీర్మన్‌పల్లి గ్రామ పరిధిలో రూ.5 కోట్ల వ్యయంతో నిర్మించిన ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాలేజీ నూతన భవనాన్ని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క శనివారం ప్రారంభించనున్నారు. ఈ మేరకు స్థానిక నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి వెల్లడించారు. మంత్రి పర్యటనకు ముందుగా ఎమ్మెల్యే భూపతిరెడ్డి నూతన కళాశాల భవనాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు, పార్టీ నాయకులు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. ఈ కళాశాల ప్రారంభంతో గిరిజన విద్యార్థులకు ఆధునిక వసతులతో కూడిన విద్యా అవకాశాలు అందుబాటులోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు చింతల కిషన్, ఇందల్వాయి గ్రామ సర్పంచ్ లోకని గంగామణి గంగారం, పీఏసీఎస్ చైర్మన్ చింతలపల్లి గోవర్ధన్ రెడ్డి, మాజీ సర్పంచ్ అరిపెళ్లి దశరథ్, మోతీలాల్ నాయక్, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.