Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 October 2026, 3:13 pm Posted by : ramakrishna

రేపు బాన్సువాడకు మంత్రి సీతక్క రాక

 

. . . పలు అభివృద్ధి పనులకు . . .  కొత్త భవనాలకు భూమిపూజ

 

. . . అధికారులు, ప్రజాప్రతినిధులతో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సమావేశం

 

బాన్సువాడ బతుకమ్మ :

 

బాన్సువాడ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, నూతన నిర్మాణాలకు భూమిపూజ చేసేందుకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి అనసూయ సీతక్క మంగళవారం బాన్సువాడలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా కొయ్యగుట్ట తాండలో నూతన గ్రామ పంచాయతీ భవనం, మహిళా సమాఖ్య భవనాల నిర్మాణానికి భూమిపూజ చేయనున్నారు. బాన్సువాడ పట్టణంలోని 3వ వార్డులో నూతనంగా నిర్మించిన మహిళా సమాఖ్య భవనాన్ని, బోర్లం గ్రామ శివారులో నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించనున్నారు.మంత్రి సీతక్క పర్యటన ఏర్పాట్లపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పట్టణ, గ్రామీణ ప్రాంతాల ప్రజాప్రతినిధులు, నాయకులతో సమావేశమై సమీక్ష నిర్వహించారు. కార్యక్రమాల నిర్వహణ, ఏర్పాట్లకు సంబంధించి నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర మాజీ ఆగ్రోస్ ఛైర్మన్ కాసుల బాలరాజు పాల్గొన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు బాన్సువాడ గ్రామీణ మండలం కొయ్యగుట్ట తాండలో నూతన గ్రామ పంచాయతీ భవనం, మహిళా సమాఖ్య భవనాల నిర్మాణానికి భూమిపూజ, మధ్యాహ్నం 3 గంటలకు: బాన్సువాడ పట్టణంలోని 3వ వార్డులో నూతనంగా నిర్మించిన మహిళా సమాఖ్య భవనం ప్రారంభోత్సవం, 3:30 గంటలకు బోర్లం గ్రామ శివారులో నూతనంగా నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ ప్రారంభోత్సవం చేయనున్నట్లు తెలిపారు. మంత్రి పర్యటన సందర్భంగా అన్ని ఏర్పాట్లను ప్రజాప్రతినిధులు, నాయకులు సమన్వయంతో చేపట్టి కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు.

Minister Seethakka to visit Banswada tomorrow