Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 October 2025, 1:00 pm Posted by : ramakrishna

అడ్లూరికి క్షమాపణలు చెప్పిన మంత్రి పొన్నం

హైదరాబాద్, బతుకమ్మ :  మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు వ్యక్తిగతంగా  క్షమాపణలు చెబుతున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.  పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ నివాసంలో బుధవారం ఈమంత్రులిద్దరు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ అడ్లూరి లక్ష్మణ్ ను తాను ఏమి అనలేదని, నేను ఆమాట అనకపోయినా పత్రికల్లో వచ్చిన దానికి అడ్లూరి బాధపడితే వ్యక్తిగతంగా క్షమాపణలు కోరుతున్నానన్నారు. మంత్రి అడ్లూరికి, నాకు పార్టీ సంక్షేమం తప్ప మరో ఉద్దేశం లేదని అన్నారు. ఇద్దరు మంత్రుల మధ్య మహేశ్ కుమార్ గౌడ్ సయోధ్య కుదర్చారు. దీంతో ఈవివాదం సద్దుమనిగింది.