మంత్రి పొంగులేటి కి తప్పిన ప్రమాదం
నాగర్ కర్నూలు, బతుకమ్మ : రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. భూభారతి చట్టం అవగాహన సదస్సు కోసం నాగర్ కర్నూలు జిల్లాకు శనివారం మంత్రి పొంగులేటి, ఎంపీ మల్లు రవి, సంపత్ కుమార్ కలిసి హెలికాప్టర్లో వచ్చారు. కలెక్టరేట్ ప్రాంగణంలో హెలికాప్టర్ ల్యాండింగ్ చేస్తున్న సమయంలో సిగ్నల్ కోసం బుల్లెట్ ఫైర్ చేయడంతో కింద ఉన్న గడ్డి పై పడి అగ్నిప్రమాదం సంభవించింది. పోలీసులు ఫైర్స్ సిబ్బంది అప్రమత్తమై మంటలను ఆర్పి వేశారు.