విద్యాశాఖ మంత్రిని నియమించాలి
పీడీఎస్యూ జాతీయ నాయకులు నామాల ఆజాద్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణలో విద్యాశాఖ మంత్రి నియమించాలని, బడ్జెట్లో విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని పీడీఎస్యూ జాతీయ నాయకులు నామాల ఆజాద్ డిమాండ్ చేశారు. నగరంలోని కోటగల్లీలో గల ఎన్ఆర్ భవన్ లో పీడీఎస్యూ ఆధ్వర్యంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ జాతీయ నాయకులు నామాల ఆజాద్ మాట్లాడారు. పెండింగ్ రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పాఠశాల విద్యలో 5, 8 తరగతులకు డిటెన్షన్...