Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 February 2025, 4:57 pm Posted by : ramakrishna

విద్యాశాఖ మంత్రిని నియమించాలి

  • పీడీఎస్యూ జాతీయ నాయకులు నామాల ఆజాద్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణలో విద్యాశాఖ మంత్రి నియమించాలని, బడ్జెట్లో విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని పీడీఎస్యూ జాతీయ నాయకులు నామాల ఆజాద్ డిమాండ్ చేశారు. నగరంలోని కోటగల్లీలో గల ఎన్ఆర్ భవన్ లో పీడీఎస్యూ ఆధ్వర్యంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ జాతీయ నాయకులు నామాల ఆజాద్ మాట్లాడారు. పెండింగ్ రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.  పాఠశాల విద్యలో 5, 8 తరగతులకు డిటెన్షన్ విధానం రద్దు చేయాలని, విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తిని కాపాడాలని, అమెరికాలో భారత పౌరులపై ట్రంప్ దుశ్చర్యలను ఖండించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్, జిల్లా ఉపాధ్యక్షులు ఎల్. అనిల్ పి.డి.ఎస్.యు. నాయకులు మమత,నాగేష్, నసీర్,సృజన్, సునీల్, అరుణ్,రాజు, తదితరులు పాల్గొన్నారు.