హైదరాబాద్, బతుకమ్మ : రాష్ట్రవ్యాప్తంగా శివాలయాల్లో మహాశివరాత్రి ఏర్పాట్లపై దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, ఈవోలతో మంత్రి కొండా సురేఖ మంగళవారం సమీక్ష సమావేశo నిర్వహించారు. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే వేములవాడ, కాళేశ్వరం, భద్రకాళి, ఏడుపాయల తదితర దేవస్థానాల్లో అవసరమైన ఏర్పాట్లపై ఆరా తీశారు. గత ఏడాది అనుభవాల ఆధారంగా ఈ ఏడాది చర్యలు చేపట్టాలని మంత్రి సూచనలు చేశారు.