మహంకాళి అమ్మవారికి మారు బోనం సమర్పించిన మంత్రి కొండా సురేఖ

  సికింద్రాబాద్, బతుకమ్మ :   ఆషాఢ బోనాల ఉత్సవాల్లో భాగంగా అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖామంత్రి కొండా సురేఖ సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి మంగళవారం మారు బోనం సమర్పించారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి దేవాదాయ శాఖ డైరెక్టర్ హనుమంతరావు, అసిస్టెంట్ కమిషనర్ మనోహర్ రెడ్డి, ఆలయ అర్చకులు డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాల మధ్య ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి కొండా సురేఖ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుల ఆధ్వర్యంలో జరిగిన...