Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 July 2025, 12:34 pm Posted by : ramakrishna

హై లెవల్ బ్రిడ్జిని ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి

కామారెడ్డి, బతుకమ్మ : జుక్కల్ నియోజకవర్గంలో మద్దెలచెరువు – పిట్లం రోడ్, తిమ్మనగర్ వద్ద రూ.4.86 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన హై లెవల్ బ్రిడ్జిని సోమవారం రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖమంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో  స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, సబ్ కలెక్టర్ కిరణ్మయి, జాయింట్ కలెక్టర్ విక్టర్ ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు. అంతకు ముందు మంత్రి కోమటిరెడ్డికి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, సబ్ కలెక్టర్ కిరణ్మయి, జాయింట్ కలెక్టర్ విక్టర్ పూల మొక్క అందించి స్వాగతం పలికారు.

Minister Komatireddy inaugurated the high level bridge