మెండోరా, బతుకమ్మ: ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును మంగళవారం మంత్రి జూపల్లి కృష్ణారావు సందర్శించారు. ఆయనతోపాటు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఉన్నారు. ఇద్దరు కలిసి ప్రాజెక్టు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి నదికి వరదలు పెరిగే అవకాశం ఉన్నందున పరిసర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆయన సూచించారు.
