Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 November 2024, 8:10 pm Posted by : ramakrishna

టీఎన్జీఓ ఆధ్వర్యంలో మంత్రికి సన్మానం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : అధికారిక పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రానికి వచ్చిన రోడ్డు, భవనాలు శాఖామంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని టీఎన్జీఓ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.  కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో  టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్, జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్, టీఎన్జీవో సహాధ్యక్షులు పెద్దోళ్ళ నాగరాజు, చిట్టి నారాయణ రెడ్డి, టీఎన్జీవో కేంద్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, కోశాధికారి సుంకరి దినేష్ బాబు, అర్బన్ కార్యదర్శి జాకీర్ హుస్సేన్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఉమా కిరణ్, ఇందిర , గురుచరణ్,ముఖ్య సలహాదారులు వనమాల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.