Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 February 2026, 9:00 pm Posted by : ramakrishna

బాన్సువాడ ముదిరాజ్ సంఘం ఇన్చార్జిగా మంత్రి గణేష్

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

రాష్ట్ర ముదిరాజ్ మహాసభ బాన్సువాడ నియోజకవర్గం ఇన్చార్జిగా మంత్రి గణేష్ ను నియమిస్తున్నట్లు ముదిరాజ్ సంఘం నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా నియామక పత్రాన్ని జిల్లా అధ్యక్షులు భూపాల్ విజయనంద్ చేతుల మీదుగా మంత్రి గణేష్ కు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి గణేష్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ముదిరాజ్ కులస్తులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవ చేస్తానని అన్నారు. తనపై ఎంతో నమ్మకంతో అప్పగించిన బాధ్యతను నిర్వహిస్తానని, తన ఎంపికకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.