రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఆశీర్వాదంతో మైనింగ్ దందా

నిజామాబాద్, బతుకమ్మ:  నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని మల్కాపూర్ లో బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి  శుక్రవారం మొరం క్వారీలను పరిశీలించారు.  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ భూముల్లో అక్రమ మొరం తవ్వకాలు జరుగుతున్నాయని, ఈ దందాకు రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ప్రోత్సాహం ఉందని ఆరోపించారు.  ప్రభుత్వం ప్రజల కోసం భూములు కేటాయించిందని,  కాంగ్రెస్ నేతలు దోపిడీకి దిగారని ఆరోపించారు. మల్కాపూర్, జాన్కంపేట్, ప్రాంతాల్లో మొరం మాఫియా రెచ్చిపోతుందన్నారు.  రోడ్డుపై వందలాది టిప్పర్లు తిరుగుతూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని చెప్పారు. ...