Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 November 2025, 6:32 pm Posted by : ramakrishna

ఇసుక పాయింట్ పరిశీలించిన మైనింగ్ అధికారులు

..

కోటగిరి , బతుకమ్మ –

అనుమతులు పొందిన చోట కాకుండా మంజీరా నది నుండి తప్పడు వే బిల్లులతో టిప్పర్ల ద్వారా ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్నారని ఆరోపిస్తూ సోమవారం రోజు పోతంగల్ గ్రామస్తులు టిప్పర్లను అడ్డుకోవడంతో మంగళవారం రోజు రెవిన్యూ, పోలీస్, మైనింగ్ శాఖల అధికారులు ఇసుక పాయింట్ ను పరిశీలించారు. ఈ సందర్బంగా స్థానిక ఎంఆర్ఓ గంగాధర్ మాట్లాడుతూ… ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల కోసం జిల్లా కలెక్టర్ అనుమతులతో ప్రవేట్ వ్యక్తి కి చెందిన వ్యవసాయం భూమిలోని ఇసుక మేటల నుండి మాత్రమే ఇసుక తరలిస్తున్నారని మంజీరా నది నుండి ఎలాంటి ఇసుక అక్రమంగా తరలించారు లేదని ఆయన తెలిపారు..

మీడియాకు మొఖం చాటేసిన మైనింగ్ అధికారులు….

కోడిచర్ల శివారులోనీ మంజీరా నది నుండి తప్పుడు వే బిల్లుల ద్వారా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారనీ పోతంగల్ గ్రామస్తులు సోమవారం అడ్డుకున్న వార్త పలు వార్త పత్రికలలో ప్రచురితం కావడంతో మంగళవారం రోజున మైనింగ్ శాఖ టెక్నికల్ అసిస్టెంట్ నాగేశ్వర్, బోధన్ ఏసీపీ శ్రీనివాస్, ఎంఆర్ఓ గంగాధర్ లు ఇసుక పాయింట్ ను పరిశీలించిన తదనంతరం మైనింగ్ శాఖ అధికారులకు వివరణ ఇవ్వాలని కోరగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రెవెన్యూ అధికారుల బాధ్యత అన్నట్టుగా వెళ్లిపోవడం గమనార్థం.

Mining officials inspect sand point