Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 July 2026, 5:19 pm Posted by : ramakrishna

కనీస వేతనాలు అమలు చేయాలి

 

. . . ఏఐటీయూసి రాష్ట్ర కార్యదర్శి వై.ఓమయ్య

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ఆసుపత్రి సిబ్బందికి పిఆర్సి ప్రకటించి కనీస వేతనాలు అమలు చేయాలని ఏఐటీయూసి రాష్ట్ర కార్యదర్శి వై.ఓమయ్య అన్నారు. ఈ మేరకు బుధవారం తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసి రాష్ట్ర కార్యదర్శి వై.ఓమయ్య మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కళాశాల, ఆసుపత్రులలో పనిచేస్తున్న శానిటేషన్, సెక్యూరిటీ, పేషంట్ కేర్ సిబ్బందికి సంబంధించిన వేతన సవరణ ఒప్పందం కాల పరిమితి ముగిసి సంవత్సరం అవుతున్న ఇప్పటికీ వేతనాలు పెరగకపోవడం అన్యాయమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు కాంటాక్ట్, ఔట్సోర్సింగ్ విధానాన్ని రద్దుచేసి కార్పొరేషన్ ను ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని వెంటనే కార్పొరేషన్ ను ఏర్పాటు చేయడంతో పాటు పిఆర్సి ప్రకటించి కనీస వేతనాలు అమలు చేయాలని, ప్రస్తుతం కార్మికులపై పని భారం పెరుగుతున్నందున కార్మికుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు. సంవత్సరానికి 23 జాతీయ, పండుగ, అర్జీత సెలవులు ఇవ్వాలనీ ఈ నెల “9న కోటిలోని డీఎంఈ” కార్యాలయం ముట్టడి ఉన్నదని అప్పటికి సమస్య పరిష్కారం కాకపోతే సమ్మె నిర్వహించక తప్పదని అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ కోశాధికారి భాగ్యలక్ష్మి, నాయకులు కవిత, స్వరూప, భారతి, కవిత, వెంకటేష్, శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు.