. . . యశోద హాస్పిటల్స్ థోరాసిక్ సర్జన్ డాక్టర్ సి.రోహన్ రెడ్డి
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ఊపిరితిత్తులు, అన్నవాహిక, ఛాతి మధ్య భాగం (మీడియాటినం), డయాఫ్రేమ్, ఛాతీ గోడకు వచ్చే వ్యాదులను గుర్తించి చికిత్స చేయడానికి సోమాజిగూడ యశోద హాస్పిటల్స్ అత్యాధునిక విదానాలను ఉపయోగిస్తోందని యశోద హాస్పిటల్స్ దొరాసిక్ సర్జన్ డాక్టర్ సి.రోహన్ రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మినిమల్లీ ఇన్వాసివ్, రోబోట్ సహాయంతో చేసి సర్జరీల ద్వారా మెరుగైన వైద్యం అందిస్తోందన్నారు. ఊపిరితిత్తుల క్యాన్సర్, అన్నవాహిక క్యాన్సర్, ఛాతీలో కణితులు వంటి వ్యాదులపై ప్రజల్లో అవగాహన పెరుగుతోందని, వ్యాదిని త్వరగా గుర్తించడం వల్ల పేషంట్ల కు మరింత సురక్షితమైన ఆపరేషన్లను ఆసుపత్రి అందిస్తోందన్నారు. దీని ద్వారా ఖచ్చితమైన చికిత్స లబించడమే కాకుండా, పేషెంట్లు త్వరగా కోలుకొని ఆరోగ్యంగా ఇంటికి వెళుతున్నారన్నారు. థొరాసిక్ సర్జరీ అంటే గుండెను మినహాయించి, చాతీలో వచ్చే ఇతర వ్యాధులకు చేసే ప్రత్యేకమైన ఆపరేషన్, కొన్ని క్లిష్టమైన సమస్యలకు చాతీని పూర్తిగా తెరిచి చేసే ఓపెన్ సర్జరీ తప్పనిసరి అయినప్పటికీ, ఇప్పుడు ఆధునిక పద్ధతులు అందుబాటులోకి వచ్చాయన్నారు. వీడియో కెమెరా సాయంతో చేసే సర్జరీ (వాట్స్), రోబోట్ సహాయంతో చేసే సర్జరీ (రాట్స్) వంటి పద్ధతుల ద్వారా కేవలం ఒక చిన్న రంద్రం లేదా కోతతో ఆపరేషన్లు చేస్తున్నారన్నారు. వీటి వల్ల పేషంట్లకు సర్జరీ కోత, నొప్పి చాలా తక్కువగా ఉంటాయని, ఆసుపత్రిలో ఎక్కువ రోజులు ఉండాల్సిన అవసరం కూడా ఉండదన్నారు. పేషేంట్లు చాలా త్వరగా తమ పనులు తాము చేసుకోగలుగుతారన్నారు. డాక్టర్లు కూడా చుట్టుపక్కల ఉండే అవయవాలకు ఎలాంటి హాని కలగకుండా చాలా ఖచ్చితత్వంతో ఈ ఆపరేషన్ చేయగలుగుతున్నారన్నారు. గత పదేళ్లలో చాతీ సర్జరీల్లో ఎన్నో మార్పులు వచ్చాయని ఈ రోజుల్లో చిన్న కోతతో లేదా రోబోట్ సహాయంతో ఆపరేషన్లు చేస్తున్నామన్నారు. దీని వల్ల సంక్లిష్టమైన సమస్యలకు కూడా శరీరానికి పెద్దగా ఇబ్బంది కలగకుండా ఖచ్చితంగా చికిత్స చేయగలుగుతున్నామని చెప్పారు. “వ్యాధిని ముందుగానే గుర్తించడం ఆధునిక సర్జరీ నైపుణ్యాలు అన్ని విభాగాల వైద్యులు కలిసి క్యాన్సర్ కు వైద్యం చేయడం వల్ల పేషేంట్లకు అత్యుత్తమ చికిత్స అందుతోందన్నారు. వారు త్వరగా కోలుకొని సాధారణ జీవితం గడపగలుగుతున్నారన్నారు. ప్రతి పేషంట్ కు వారి ఆరోగ్యపరిస్థితికి తగ్గట్టుగా ఆధునిక టెక్నాలజీని ఉపయోగిస్తూనే ప్రేమతో కూడిన వైద్యం అందించడమే మా లక్ష్యమని ఆయన వివరించారు. అధునాతన ఆపరేషన్ థియేటర్లు, హై-డెఫినిషన్ ఇమేజింగ్ సిస్టమ్స్, రోబోటిక్ సర్జికల్ ప్లాట్ఫారమీలు, థొరాసిక్ సర్జన్లు, పల్మోనాలజిస్ట్లు, ఆంకాలజిస్ట్లు, రేడియాలజిస్ట్లు, అనస్థీషియాలజిస్ధలు, క్రిటికల్ కేర్ నిపుణులతో కూడిన మల్టీడిసిప్లేనరీ బృందం మద్దతుతో, యశోద హాస్పిటల్స్ అనేక రకాల థొరాసిక్ (చాతి) సమస్యలకు సమగ్రమైన చికిత్సను అందిస్తోందన్నారు. ప్రారంభ దశలో ఉన్న ఊపిరితిత్తుల క్యాన్సర్లు, అన్నవాహిక వ్యాధుల నుండి ప్రాణాపాయం లేని ఛాతి కణితులు సంక్లిష్టమైన దాతీ ఎమర్జెన్సీల వరకు, హాస్పిటల్ ఎవిడెన్స్- బేస్డ్, మినిమల్లీ నాసిస్ సర్టికల్ సేవలను నిరంతరం విస్తరిస్తోందన్నారు . పేషింట్లు మెరుగైన భద్రత సౌకర్యంతో మంచి పలితాలను సాదించడంలో సహాయపడుతుందన్నారు. యశోద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ గత మూడు దశాబ్దాలుగా వైవిద్యమైన వైద్య అవసరాలు కలిగిన ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలను అందిస్తోందని, సమర్ధవంతమైన నాయకత్వం బలమైన యాజమాన్యం కింద, యశోద గ్రూప్ అత్యున్నత ప్రమాణాలతో కూడిన వైద్య చికిత్సను అందించే ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’గా ఎదిగిందన్నారు. పేషంట్ల అవసరాలకు అనుగుణంగా, అరుదైన క్లిష్టమైన ప్రక్రియల కోసం సైతం విప్లవాత్మక సాంకేతికతను ఉపయోగిస్తూ, యశోద గ్రూప్ ప్రతి వైద్య విభాగంలోనూ అత్యాధునిక రోగనిర్ధారణ చికిత్సా సేవలను అందిస్తోందన్నారు. ఈ విలేకరుల సమావేశంలో సీనియర్ మేనేజర్ రూపేష్ షిండే, మార్కెటింగ్ మేనేజర్ అమర్నాథ్ మూర్తి లు పాల్గొన్నారు.