Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 November 2024, 9:03 pm Posted by : ramakrishna

బొందం చెరువు బాధితులకు ఎంఐఎం అండగా ఉంటుంది

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని పదవ డివిజన్ లోని బొంద చెరువు శిఖం భూమిలో ఆక్రమణల తొలగింపు సందర్భంగా నిరాశ్రయులైన బాధితులకు మజిలీస్ పార్టీ అండగా ఉంటుందని ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఫయాజ్ అన్నారు. ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ఆదేశాల మేరకు శనివారం మజిలీస్ పార్టీ కార్పొరేటర్లు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును కలిశారు. ఆగస్టు 17న జిల్లా యంత్రాంగం నిజామాబాద్ నగరంలో బొంద o చెరువు శిఖం భూమిలో అక్రమంగా ఇళ్ల నిర్మించుకున్నారని 39 ఇండ్లను బల్లి అధికారులు కూల్చివేశారు. దానితో ఇండ్లు లేకుండా అక్కడ ప్లాట్లు కొనుగోలు చేసిన వారు నిరాశ్రయులయ్యారు వారికి మద్దతుగా మజిలీస్ పార్టీ జిల్లా కలెక్టర్ కలిసి వారిని ఆదుకోవాలని కోరారు. రెండు పడకల గదులు ఇళ్లను కేటాయించాలని లేదా ప్రభుత్వ స్థలాలను కేటాయించి వారికి ఇంటి నిర్మాణానికి ప్రభుత్వ సహాయ సహకారాలు అందించాలని మజిలీస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఫయాజ్తోపాటు కార్పొరేటర్లు డిమాండ్ చేశారు.

MIM stands by Bondam pond victims