Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 October 2025, 8:29 pm Posted by : ramakrishna

సీపీని కలిసిన ఎంఐఏం నాయకులు

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్యను నిజామాబాద్ మజ్లీస్ నాయకులు మర్యాద పూర్వకంగా కలిసారు. ఇటీవల జిల్లా కేంద్రంలో సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య, రౌడీ షీటర్ రియాజ్ ఎన్ కౌంటర్, గాయపడిన ఆసీఫ్, పోలీసుల వేదింపుల ఘటనలపై సీపీని కలిసి చర్చించారు. మజ్లీస్ పార్టీ అధినేత అసదుద్ధిన్ ఓవైసీ ఆదేశాల మేరకు గురువారం ఎంఐఏం నాయకులు సమావేశమై జిల్లా కేంద్రంలో జరిగిన ఘటనలపై మాట్లాడారు. గత వారం రోజులుగా జరిగిన ఘటనపై ప్రజలకు న్యాయం జరుగాలని, అమాయకులపై వేదింపులు ఆగాలని, ప్రభుత్వం తరుపున వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఫయాజ్, నగర అధ్యక్షుడు షకీల్ అహ్మద్, మాజీ డిప్యూటి మేయర్ ఇద్రీస్ ఖాన్ తో పాటు షహబాజ్, అమేర్ తదితరులు పాల్గొన్నారు.

MIM leaders meet CP