Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 February 2026, 7:08 pm Posted by : ramakrishna

17 వార్డు నుండి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఎంఐఎం

 

. . . ఎంఐఎం పార్టీ అభ్యర్థిగా ఫర్హనాజ్ లయక్

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

బాన్సువాడ మున్సిపాలిటీ 17 వార్డు నుంచి మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ అభ్యర్థి ఫర్హనాజ్ లయక్ పోటీ చేస్తున్నట్టు తెలిపారు. ఈ విషయమై సోమవారం ఎంఐఎం పార్టీ బీఫారం దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఐదు సంవత్సరాలు కాలనీలో సీసీ రోడ్ల అభివృద్ధి, డ్రైనేజీ నిర్మాణ పనులు, నీటి సరఫరా, పారిశుద్ధ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టి బాన్సువాడ పట్టణంలోనే మంచిగా అభివృద్ధి చెందిన కాలనీగా మారుస్తానని ఆయన అన్నారు. కాలనీలోని మౌలిక వసతులు, అలాగే కాలనీవాసుల వ్యక్తిగత సమస్యలు, వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టి, కుల, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా చిన్న, పెద్ద అని తేడా లేకుండా కాలనీవాసులకు నిరంతరం అందుబాటులో ఉండి ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం పార్టీ అధ్యక్షులు సయీద్ ఖాన్, నాయకులు అంజాద్ ఖాన్, అహ్మద్, అవేజ్, హాశం, రసూల్, ఐజాజ్ పాల్గొన్నారు.