Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 January 2026, 7:56 pm Posted by : ramakrishna

18వ వార్డులో ఎంఐఎం అభ్యర్థి ఇలియాస్ నామినేషన్

 

బోధన్, బతుకమ్మ :

 

బోధన్ పట్టణంలోని 18వ వార్డుకు సంబంధించిన మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎంఐఎం టౌన్ ప్రెసిడెంట్ ఇలియాస్ నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం సంబంధిత ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఆయన తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఇలియాస్ మాట్లాడుతూ, 18వ వార్డులో మౌలిక వసతుల అభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీరు, రహదారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని పరిష్కార మార్గాలు చూపుతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.