Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 October 2024, 6:04 pm Posted by : ramakrishna

మిల్లర్లు ధాన్యానికి బ్యాంక్ పూచికత్తు ఇవ్వాలి

  • కామారెడ్డి జిల్లా కలెక్టర్ అశీష్ సంగ్వాన్

కామారెడ్డి, బతుకమ్మ: ప్రభుత్వ ఆదేశాల మేరకు 2024-25 సంవత్సరం వరి ధాన్యాన్ని తీసుకునే ప్రతి మిల్లర్ వ్యక్తిగత బ్యాంక్ పూచీకత్తు తప్పనిసరిగా సమర్పించవలసిందేనని కామారెడ్డి కలెక్టర్ అశీష్ సంగ్వాన్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ లోని సమావేశ మందిరం లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశం లో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ వరి ధాన్యాన్ని సీయంఆర్ కోసం తీసుకునే ప్రతి మిల్లర్ వ్యక్తిగత బ్యాంక్ పూచీకత్తు తప్పనిసరిగా సమర్పించవలసిందిగా కోరారు. అలాగే మిల్లర్లు ధాన్యాన్ని తొందరగా మిల్లులో దించుకోవాలని ఆయన సూచించారు. అలాగే మిల్లర్లు, అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశం లో అదనపు కలెక్టర్ వి.విక్టర్, జిల్లా మేనేజర్ రాజేందర్, డి.సి.ఎస్.ఓ.నరసింహారావు, సంబందిత శాఖల అధికారులు పాల్గొన్నారు.