Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 July 2026, 6:47 pm Posted by : ramakrishna

సీఎం, డిప్యూటి సీఎం ఫోటోలకు పాలాభిషేకం

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

రైతు భరోసా నిధులను రైతుల ఖాతాలో జమ చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటి సీఎం, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ఫోటోలకు శుక్రవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్బంగా నగేష్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు ఎకరానికి 6 వేల చొప్పున జమ చేయడం జరిగిందని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, జిల్లా కాంగ్రెస్ పార్టీ కోశాధికారి భక్త వత్సలమ్, జిల్లా సేవాదళ్ అధ్యక్షులు సంతోష్, జిల్లా యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విపుల్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి గణేష్, వినోద్, కిష్టా గౌడ్, వాహీద్ తదితరులు పాల్గొన్నారు.