Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 April 2025, 8:58 pm Posted by : ramakrishna

దుబాయ్ లో వలస కార్మికుడి మృతి

కామారెడ్డి, బతుకమ్మ : రెడ్డిపేట్ గ్రామానికి చెందిన బట్టు సురేష్ అనే వ్యక్తి దుబాయిలో బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో  ఈనెల 12న మృతి చెందినట్లు జీడబ్ల్యూఏసీ రామారెడ్డి మండల్ ప్రెసిడెంట్ బండ సురేందర్ రెడ్డి తెలిపారు. దుబాయ్ లో ఉన్న బట్టు శంకర్ నవీన్ అనే ఎంబసీ దారా మాట్లాడి తన మృతదేహాన్ని బుధవారం రాత్రి పంపించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. గల్ఫ్ లో చనిపోయిన వ్యక్తికి ఇద్దరు కుమారులు ఉన్నారన్నారు. ఆర్థికంగా వెనుకబడి ఉండడంతో గల్ఫ్ బాట పట్టాడనితెలిపారు. మన తెలంగాణ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన గల్ఫ్ ఎక్రేషియా ఏదైతే ఉందో కలెక్టర్ స్పందించి కుటుంబానికి అందించాలని కోరారు.