అర్ధరాత్రి ఇసుక అక్రమ దందా
పట్టించుకోని సంబంధిత శాఖ అధికారులు బిచ్కుంద మండలంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతుంది. సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో అక్రమార్కులు ధనార్జనే ధ్యేయంగా ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా ఇసుక దందా కొనసాగిస్తున్నారు. బిచ్కుంద మండలంలో ఇసుక అక్రమ రవాణా అడ్డూ అదుపు లేకుండా పోతుంది. హస్గుల్, శెట్లూర్,పుల్కల్ ,ఖాత్గవ్ గ్రామాలలో మంజీరా నది నుంచి పెద్ద మొత్తంలో ఇసుకను తవ్వి కర్ణాటక, మహారాష్ట్ర లాంటి ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. నిత్యం అక్రమ ఇసుక వ్యాపారులకు ఇసుక దందా కాసుల...