బతుకమ్మ, నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ నగరంలో మిట్ట మధ్యాహ్నం కూడా వీధి దీపాలు వెలుగుతూనే ఉన్నాయి. మున్సిపల్ శాఖలో దీపాల నిమిత్తం కేటాయించిన సిబ్బంది ఉద్యోగాలు సరిగా చేయకపోవడం వల్లే మిట్ట మధ్యాహ్నం కూడా ఈ వీధి దీపాలు వెలుగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పుడైనా సంబంధిత అధికారులు కలగజేసుకుని ఎవరి పనులు వారు సక్రమంగా నిర్వర్తించేలా చూడాలని మున్సిపల్ అధికారులను స్థానిక ప్రజలు కోరుతున్నారు.