Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 December 2025, 12:01 pm Posted by : ramakrishna

లేక్ టౌన్ లో మెస్సి విగ్రహావిష్కరణ

వెబ్ న్యూస్, బతుకమ్మ : పశ్చిమబెంగాల్ లోని లేక్ టౌన్ తన 70 అడుగుల విగ్రహాన్ని బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ తో కలిసి పుట్ బాల్ క్రీడాకారుడు మెస్సి వర్చువల్ గా ఆవిష్కరించారు.. గోట్ టూర్ ఆఫ్ ఇండియా పర్యటనలో భాగంగా అర్జెంటీనా ఫుట్ బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి శనివారం తెల్లవారుజామున కోల్ కతాకు చేరుకున్నారు. కోల్ కతాలో కార్యక్రమం ముగియగానే మెస్సి హైదరాబాద్ కు వస్తారు. ఫలక్ నుమా ప్యాలెస్ లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. ఉప్పల్ స్టేడియంలో రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే ఫుట్ బాల్ మ్యాచ్ లో రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, మెస్సి పాల్గొంటారు.  సోమవారం ప్రధాని నరేంద్ర మోదీని కలవడంతో భారత మెస్సి పర్యటన ముగుస్తుంది.