ముగిసిన ఎంఈఎస్ ప్రొబెషనరీ అధికారుల బృందం పర్యటన

నిజామాబాద్, బతుకమ్మ : తమ శిక్షణలో భాగంగా క్షేత్ర స్థాయిలో వివిధ అంశాల అధ్యయనం కోసం నిజామాబాద్ కు హాజరైన మిలిటరీ ఇంజినీరింగ్ సర్వీసెస్ ప్రొబెషనరీ అధికారుల బృందం పర్యటన శనివారం ముగిసింది. 30 మందితో కూడిన అధికారులను ఆరు బృందాలుగా విభజిస్తూ, ఒక్కో బృందానికి ఒక గ్రామం చొప్పున క్షేత్రస్థాయి అధ్యయనం జరిపించారు. మోర్తాడ్ మండలంలోని తిమ్మాపూర్, సుంకెట్, దొన్కల్, నందిపేట మండలంలోని సిద్దాపూర్, వన్నెల్(కె), వెల్మల్ గ్రామాలతో పాటు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రొబేషనరీ అధికారులతో కూడిన బృందాలు ఎనిమిది రోజుల...