Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 February 2026, 4:40 pm Posted by : ramakrishna

సనాతన హిందూ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక మేరు కులస్తులు

 

. . . పేద మేరు కులస్తులకు తన ట్రస్ట్ ద్వారా 10 కుట్టు మిషిన్లు ఉచితంగా అందజేత

 

. . . టైలర్స్ డే వేడుకలో పాల్గొన్న ఇందూరు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

సనాతన హిందూ సంస్కృతి సంప్రదాయాలకు మేరు కులస్తులు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారని వారు కుట్టే కుట్టు మిషన్లకు పూజ చేయనిదే బట్టలు కూడా కుట్టరని ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ పేర్కొన్నారు. అది వారికి ఉన్న హిందూ సంస్కృతి యొక్క గొప్పదనం గౌరవం అని ఆయన పేర్కొన్నారు. అలాగే ఐక్యతకు మారుపేరు మేరు కులస్తులు అని ఎమ్మెల్యే అన్నారు. వారంతా ఐక్యమత్యంతో ఉండి ప్రభుత్వంతో వారికి రావాల్సిన ఫలాలను పోరాడి మరి దక్కించుకుంటారని పేర్కొన్నారు. టైలర్స్ డేకు తనకు ఎనలేని సంబంధం ఉందని, ప్రతి టైలర్స్ డే రోజున మేరు కులస్తులు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొని వారికి ప్రోత్సాహం అందిస్తానని అన్నారు. ఈ సందర్భంగా టైలర్స్ బట్టలు కుడితేనే మాలాంటి రాజకీయ నాయకులు ఖద్దరు బట్టలు ధరిస్తారని, అందరూ రెడీమేడ్ దుస్తులకు దూరంగా ఉండి దర్జీలు కష్టపడి కుట్టే బట్టలను ధరించాలన్నారు. ఈ సందర్భంగా మేరు కులస్తులలో అత్యంత పేదవారు గా ఉన్న టైలర్స్ కు ఎమ్మెల్యే తమ ట్రస్ట్ ద్వారా పది కుట్టు మిషన్లు ఉచితంగా అందజేశారు.

 

Meru castes are symbols of traditional Hindu culture and traditions.

 

దీంతో మేరు కులస్తులు సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే ని వారు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం లో మేరు కుల సంఘం అధ్యక్షులు హన్మంతరావు, కార్యవర్గం సభ్యులు, బీజేపీ కార్పొరేటర్లు నాగోల్ల లక్ష్మి నారాయణ, చింతకాయల రాజేందర్, బెల్లల్ శశాంక్, బీజేపీ నాయకులు పండు, బంటు, ప్రవీణ్, మురళి, పవన్ ముండా, శివ, పంచారెడ్డి సురేష్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

 

Meru castes are symbols of traditional Hindu culture and traditions.