ఎల్లారెడ్డి లో మెప్మా ఉద్యమ రిజిస్ట్రేషన్ క్యాంప్

  ఎల్లారెడ్డి, బతుకమ్మ :   కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఆధ్వర్యంలో బుధవారం ఉద్యమ రిజిస్ట్రేషన్ ప్రత్యేక క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్ హాజరై మహిళా సంఘ సభ్యులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మెప్మా టీఎంసీ రవిశంకర్ మాట్లాడుతూ ప్రతి సంఘానికి చెందిన ప్రతి సభ్యురాలు తప్పనిసరిగా ఉద్యమ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు....