- యోగా గురువు పర్స అనంత్ రావు
భీమ్ గల్, బతుకమ్మ : ప్రతి నిత్యం యోగ, ధ్యానం చేయడం ద్వారా మానసిక దృఢత్వం చేకూరుతుందని యోగ గురూజీ పర్స అనంతరావు అన్నారు. మంగళవారం మండలంలోని దేవక్కపేట్ గ్రామం లో భీమ్ గల్ యోగ కమిటీ బృందం ఆధ్వర్యం లో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఎస్సేస్సీ విద్యార్థులకు పరీక్ష లు వ్రాయడానికి అవసరమయ్యే పరీక్ష ల ప్యాడ్లు ,పెన్నులు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ముక్యంగా విద్యార్థులు ప్రతిరోజు యోగ, ధ్యానం పై ప్రత్యేక దృష్టిని సాధించాలని సూచించారు. తద్వారా మంచి ఫలితాలు ఉంటాయని అన్నారు. ఈ మారుమూల ప్రాంతానికి చెందిన మీరందరు కష్టపడి ,శ్రద్ధతో, ఇష్టంగా చదువు కొని మంచి ఉత్తీర్ణత సాధించిలని కోరారు.అన్ని రంగాలలో విజయం సాధించి మీ యొక్క తల్లిదండ్రుల ముఖంలో సంతోషం నింపలని,గ్రామానికి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమానికి సహకరించిన యోగ బృందానికి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమం స్థానిక గ్రామాభివృద్ధి కమిటీ సభ్యుడు అజయ్, సేవాలాల్,కార్ల స్వామి, సాయిలు, శర్మన్, భీంగల్ యోగ బృందం క్రియాశీల సభ్యులు శివకుమార్, నవీన్, రాకేష్, పిట్ల బాపూరావు , పురస్తు లింబాద్రి ,పాఠశాల ప్రధానోపాధ్యాయులు చిన్న రాజమణి, రేఖా, మోహన్, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.