విద్యార్థుల మానసిక ఆరోగ్యo దేశ ప్రగతికి సోపానం
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : హెల్త్ సెంటర్, తెలంగాణ యూనివర్సిటీ ఆధ్వర్యంలో విద్యార్థుల మానసిక ఆరోగ్యo పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యం. యాదగిరి మాట్లాడుతూ విద్యార్థులు విద్యా, పోటీ పరీక్షలు కుటుంబ వ్యవహారాలు మొదలైన వాటి ద్వారా వత్తిడికి గురికాకుండా మానసిక ధైర్యంతో ముందుకెళ్లాలని పేర్కొన్నారు. విద్యార్థి దశలో ఒత్తిడులను అధిగమించి ఉన్నత విద్యను అభ్యసించి సమాజంలో గౌరవంగా స్థిరపడాలని సూచించారు. హెల్త్ సెంటర్ ఇన్చార్జి డా. గోపిరాజు...