Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 June 2025, 5:35 pm Posted by : ramakrishna

ఏబీవీపీ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్  ఇందూరు శాఖ ఆధ్వర్యంలో బన్సల్ క్లాసెస్ కళాశాలలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ ఇందూరు  విభాగ్ కన్వీనర్ కైరి శశిధర్ మాట్లాడుతూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 1949 జూలై 9 ప్రారంభించారని తెలిపారు.  అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ దేశంలోనే దాదాపుగా 60 లక్షల మంది విద్యార్థుల మెంబర్షిప్ తో అతిపెద్ద విద్యార్థి ఆర్గనైజేషన్ గా నిరంతరం విద్యార్థి సమస్యల కోసం పనిచేస్తున్నసంస్థ ఎబివిపి అని తెలిపారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ దేశంలో ఎక్కడ ఏ విద్యార్థికి కష్టం వచ్చినా అది కాశ్మీర్ నుండి కన్యాకుమారి , అటాక్ నుండి కటక్ వరకు ఏ విద్యార్థికి కష్టం వచ్చినా అండగా ఉంటూ ఆ విద్యార్థి సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యేవరకు కూడా పని చేసే విద్యార్థి సంస్థ ఎబివిపి అని తెలిపారు. మిగతా విద్యార్థి సంస్థలు వాళ్ల వాళ్ల రాజకీయ పార్టీల మనుగడ కోసం రాజకీయ పార్టీల అధికారాన్ని తీసుకురావడం కోసం పని చేస్తే ఒక్క ఏబీవీపీ మాత్రం ఈ దేశంలో కేవలం విద్యార్థి సమస్యలపైనే, ఈ సమాజంలో జరుగుతున్న అన్యాయాల పైన నిజాయితీగా పని చేస్తున్నసంస్థ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ బాలకృష్ణ, కంటేశ్వర్ జోనల్ ఇంచార్జ్ దుర్గా దాస్, గణేష్, ప్రేమ్, సన్నీ, శశాంక్, శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.

Membership registration under the auspices of ABVP