మహిళా సంఘాల సభ్యులు ఆర్థికంగా బలోపేతం కావాలి
కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కామారెడ్డి, బతుకమ్మ : మహిళా సంఘాల సభ్యులు వ్యాపార రంగంలో రాణించి ఆర్థికంగా బలోపేతం కావాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం లింగంపేట ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన మండల సమాఖ్య సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం ఆకాంక్ష మేరకు మహిళా సంఘాల సభ్యులు వ్యాపార రంగం ఎంచుకొని అనుభవం, ఆసక్తి గల వ్యాపారాన్ని నిర్వహించి ఆర్థికంగా ఎదగాలని అన్నారు. ప్రభుత్వం మహిళాభ్యుదయం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతూ, ఋణాలు సమకూరుస్తున్నదని తెలిపారు....