Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 December 2024, 9:07 pm Posted by : ramakrishna

ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిసిన రుద్రూర్ పద్మశాలి సంఘం సభ్యులు

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలో గల పద్మాశాలి సంఘం అధ్యక్షులు గెంటల సాయిలు,  కార్యదర్శి కార్తీక్, ఆధ్వర్యంలో  పద్మాశాలి సంఘం సభ్యులు శుక్రవారం బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘ భవన నిర్మాణంకు సంబందించిన బిల్లు సమస్యను విన్నవించారు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సానుకూలంగా స్పందించి ఇచ్చిన మాట ప్రకారం పద్మశాలి భవన నిర్మాణా బిల్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా సంఘ సభ్యులు  ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో పద్మశాలి సంఘ అధ్యక్షులు గేంటిల సాయిలు, కార్యదర్శి గుద్దేటి వార్ కార్తీక్,మౌత్కూరి సాయినాథ్,తాటిపాముల విజయ్, పిడుగు శంకర్, చిక్కడపల్లి రవి, పద్మశాలి సంఘం సభ్యులు తదితరులు ఉన్నారు.