Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 May 2026, 6:17 pm Posted by : ramakrishna

కారేగాం తాండాలో మెగా హెల్త్ క్యాంపు నిర్వహణ

 

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ :

 

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా కారేగాం తాండా గ్రామ పంచాయతీ కార్యాలయంలో మెడికవర్ – లక్షణ కంటి ఆసుపత్రి సహకారంతో శనివారం మెగా హెల్త్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సర్పంచ్ డాక్టర్ రామావత్ లాల్ సింగ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ఆరోగ్య శిబిరంలో డాక్టర్ అజయ్ కుమార్, వాయిస్ అలీ, కంటి వైద్య నిపుణురాలు డాక్టర్ సోని పాల్గొని గ్రామ ప్రజలకు వైద్య సేవలు అందించారు.

 

Mega health camp organized in Karegaon Thanda

 

శిబిరంలో గుండె సంబంధిత పరీక్షలు, షుగర్ పరీక్షలు, సాధారణ ఆరోగ్య పరీక్షలతో పాటు కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి వైద్య సలహాలు మరియు చికిత్స సూచనలు అందజేశారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ సేవలను వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజల ఆరోగ్య సంక్షేమం కోసం ఇటువంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ తారా చంద్, కార్యదర్శి దుర్గా ప్రసాద్ తెలిపారు. ఈ మెగా హెల్త్ క్యాంపు గ్రామ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా నిలిచి, ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడంలో ముఖ్యపాత్ర పోషించింది.

 

Mega health camp organized in Karegaon Thanda