తెయూలో మెగా రక్తదాన శిబిరం

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : భారత ప్రభుత్వ కేంద్ర యువజన సర్వీసులు, క్రీడల ప్రాముఖ్యత శాఖ ఆదేశాల మేరకు రక్తదాన్ అమృత్ మహోత్సవ్ 2.0 కార్యక్రమంలో భాగంగా తెలంగాణ వర్సిటీలో ఎన్ ఎస్ ఎస్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించినట్టు ఎన్ ఎస్ ఎస్ సమన్వయకర్త ఆచార్య రవీందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన వైస్ ఛాన్స్లర్ ఆచార్య టి. యాదగిరిరావు మాట్లాడుతూ రక్తదానం చేయడం అంటే ప్రాణదానం  చేయడమని ప్రతి ఒక్కరూ సంవత్సరంలో కనీసం మూడుసార్లు రక్తదానం చేయాలని...