Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 September 2025, 5:21 pm Posted by : ramakrishna

తెయూలో మెగా రక్తదాన శిబిరం

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : భారత ప్రభుత్వ కేంద్ర యువజన సర్వీసులు, క్రీడల ప్రాముఖ్యత శాఖ ఆదేశాల మేరకు రక్తదాన్ అమృత్ మహోత్సవ్ 2.0 కార్యక్రమంలో భాగంగా తెలంగాణ వర్సిటీలో ఎన్ ఎస్ ఎస్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించినట్టు ఎన్ ఎస్ ఎస్ సమన్వయకర్త ఆచార్య రవీందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన వైస్ ఛాన్స్లర్ ఆచార్య టి. యాదగిరిరావు మాట్లాడుతూ రక్తదానం చేయడం అంటే ప్రాణదానం  చేయడమని ప్రతి ఒక్కరూ సంవత్సరంలో కనీసం మూడుసార్లు రక్తదానం చేయాలని సూచించారు. దీనివలన తలసేమియా వ్యాధితో పాటు ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారికి ఎంతో మేలు చేసినవరామౌతము.ఇలాంటి కార్యక్రమాలతో ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించవచ్చని తెలిపారు. గౌరవ అతిధిగా హాజరైన రిజిస్ట్రార్ ఆచార్య ఎం యాదగిరి గారు మాట్లాడుతూ రక్తదానం చేయడం వల్ల ఆరోగ్య వంతులగా జీవించవచ్చని అత్యవసర సమయంలో ఆక్సిడెంట్ వంటి కేసులలో ఉపయోగం ఉంటుందని తెలిపారు. ఈ సందర్బంగా రక్త దాతలను అభినందించారు.  రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షుడు బుస్సా ఆంజనేయులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ యూనివర్సిటీతో పాటు గిరిరాజ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్. ఎస్ ఎస్ ఆర్. వాగ్దేవి. ఆర్కే డిగ్రీ కళాశాల కామారెడ్డి తెలంగాణ రెసిడెన్షియల్ మర్క్ ల్ కళాశాల విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్(పి ఆర్ ఓ) ఏ.పున్నయ్య, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం అధికారులు డాక్టర్ స్వప్న, డాక్టర్ స్రవంతి, డాక్టర్ సంపత్, డాక్టర్ అలీమ్ ఖాన్, ఎన్ ఎస్ ఎస్, ఆఫీస్ జూనియర్ అసిస్టెంట్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.