విద్యుత్ ఉద్యోగుల మెగా రక్తదాన శిబిరం

బోధన్, బతుకమ్మ : బోధన్ డివిజన్లోని విద్యుత్ ఉద్యోగుల మెగా రక్తదాన శిబిరాన్నిగురువారం అడిషనల్ డిస్టిక్ట్ సెషన్ జడ్జ్ వి.రవికుమార్ ప్రారంభించారు. ఈ రక్తదాన శిబిరం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా నిజామాబాద్ ఆపరేషన్ ఎస్ సి ఆర్.రవీందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ ఇలాంటి మహత్తర కార్యక్రమామైన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. రక్తదానం అంటే మరొకరికి ప్రాణదానం ఇట్లాంటి కార్యక్రమాన్ని విద్యుత్ ఉద్యోగులు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు....