Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 January 2025, 2:09 pm Posted by : ramakrishna

విద్యుత్ ఉద్యోగుల మెగా రక్తదాన శిబిరం

బోధన్, బతుకమ్మ : బోధన్ డివిజన్లోని విద్యుత్ ఉద్యోగుల మెగా రక్తదాన శిబిరాన్నిగురువారం అడిషనల్ డిస్టిక్ట్ సెషన్ జడ్జ్ వి.రవికుమార్ ప్రారంభించారు. ఈ రక్తదాన శిబిరం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా నిజామాబాద్ ఆపరేషన్ ఎస్ సి ఆర్.రవీందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ ఇలాంటి మహత్తర కార్యక్రమామైన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. రక్తదానం అంటే మరొకరికి ప్రాణదానం ఇట్లాంటి కార్యక్రమాన్ని విద్యుత్ ఉద్యోగులు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రతి మూడు నాలుగు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చని తెలిపారు.  నూతన సంవత్సరం సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఆర్.రవీందర్ మాట్లాడుతూ రెడ్ క్రాస్ తలసీమియా బాధితులకు అందిస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. తాము ఈ రక్తదాన శిబిరాన్ని విద్యుత్ ఉద్యోగులు తలసీమియా బాధితుల కోసం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అలాగే ఏ ఒక్కరు కూడా రక్తం లేకుండా బాధపడకూడదనే ఉద్దేశంతోనే ఈ రక్తదాన శిబిరాలు విద్యుత్ ఉద్యోగు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా 34వసారి రక్తదానం చేస్తున్న ఏఈ నాయిని కృష్ణ ను అభినందించారు. డి ఈ ఎండి ముక్తార్, ఏ ఈ నాయిని కృష్ణ, ఏ ఏ ఓ శివాజీ, గణేష్ ముందుగా రక్తదానం చేశారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ బుస్సా ఆంజనేయులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏడి ఈ తోట రాజశేఖర్, బసవేశ్వర రావు బోధన్ డివిజన్ చైర్మన్, ఏడీ ఈ లు నగేష్ కుమార్ ,ప్రభాకర్, విద్యుత్ ఉద్యోగుల నాయకులు హైమద్ పాషా, పెంటయ్య చారి, నాయని కృష్ణ, కళ్యాణ్ ,సాయిబాబా, రమాదేవి, రెడ్ క్రాస్ ప్రతినిధులు కరిపే రవీందర్ ,వై శ్రీనివాసరావు, సూర్యనారాయణ, ఏ ఇ లు, సబ్ జూనియర్లు, ఫోర్ మెన్లు, లైన్మెన్లు సిబ్బంది  తదితరులు పాల్గొన్నారు.

Mega Blood Donation Camp for Electricity Employees