Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 May 2026, 7:00 pm Posted by : ramakrishna

ఎస్ఐఆర్ కార్యక్రమంపై రాజకీయ ప్రతినిధులతో సమావేశం

 

ఎల్లారెడ్డి, బతుకమ్మ :

 

ఎల్లారెడ్డి లోని ఆర్డీవో కార్యాలయంలో బుధవారం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) కార్యక్రమానికి సంబంధించి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐఆర్ షెడ్యూల్‌, విధి విధానాలు, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై అధికారుల ద్వారా వివరించారు. నాణ్యమైన, పారదర్శక ఓటర్ల జాబితా తయారీలో రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. అలాగే ప్రతి పోలింగ్ బూత్‌కు సంబంధించిన బూత్ స్థాయి ఏజెంట్ల  బి ఎల్ ఏ వివరాలను త్వరితగతిన సమర్పించాలని సూచించారు. సమావేశంలో ఓటర్ల జాబితా సవరణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, తొలగింపుల ప్రక్రియపై కూడా చర్చించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో ప్రభాకర్, తహసీల్దార్ ప్రేమ్ కుమార్ కార్యాలయం అధికారులు, తహసీల్దార్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

 

Meeting with political representatives on the SIR program