సీసీ కెమెరాల ఏర్పాటు పై సమావేశం
రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ గ్రామంలో సిసి కెమెరాలు ఏర్పాటు గురించి గ్రామ పెద్దలతో, షాపు యజమానులతో పోలీస్ స్టేషన్ లో మంగళవారం సమావేశం ఏర్పాటు చేసి చర్చించారు. సీసీ కెమెరాలు మరమత్తు దశకు చేరాయన్నారు. ఈ సందర్భంగా ఎస్సై సాయన్న మాట్లాడుతూ.. సీసీ కెమెరాలు ఏర్పాటుకు సహకరిస్తామని అన్నారు. ఈ సమావేశంలో గ్రామ పెద్దలు, దుకాణ సముదాయాల యజమానులు తదితరులు పాల్గొన్నారు.