ఓటర్ లిస్టులో మార్పులు, చేర్పులపై సమావేశం
బతుకమ్మ,కమ్మర్ పల్లీ:కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఓటర్ లిస్టులో మార్పులు చేర్పులపై ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ అధ్యక్షతన అన్ని పార్టీల నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. ఓటర్ లిస్టులో తప్పులు లేకుండా జాగ్రత్త వహించాలని ఈ సందర్భంగా అన్ని పార్టీల నాయకులు సూచనలు చేసినట్లు ఎంపీడీవో తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని కోరినట్లు వివరించారు.సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి, నాయకులు ఊట్నూరి ప్రదీప్, బిఆర్ఎస్ పార్టీ యూత్ మండల అధ్యక్షులు...