Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 September 2026, 7:03 pm Posted by : ramakrishna

మీ సేవా కేంద్రం అడ్డాగా నకిలీ సర్టిఫికెట్లు

. . . గుట్టురట్టు చేసిన పోలీసులు

. . . బోధన్ లో ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

బోధన్ పట్టణం రాకాసిపేట్ లోని “సహారా మీ సేవ కేంద్రం” లో నకిలీ ప్రభుత్వ సర్టిఫికెట్లు తయారు చేస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు నిజామాబాద్ సీసీఎస్ ఏసీపీ శ్రీశైలం, బోధన్ పోలీస్ సిబ్బంది కలిసి గుట్టురట్టు చేశారు. శనివారం నిజామాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో బోధన్ పట్టణ కేంద్రంలో మీ సేవ సెంటర్ అడ్డాగా జరిగిన నకిలీ సర్టిఫికెట్ల తయారి చెలామని విషయాన్ని విలేకరుల సమావేశంలో కమిషనర్ సాయిచైతన్య వెల్లడించారు. సీపీ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు నిజామాబాద్ సీసీఎస్ పోలీసులు, బోధన్ పట్టణ పోలీసులు కలిసి  రాకాసిపేట్ పెద్ద మసీదు వద్ద గల సహారా మీ సేవ కేంద్రంలో తనిఖీలు నిర్వహించి రాకాసిపేట్ కు చెందిన మీ సేవ ఆపరేటర్ షేక్ వసీమ్, మీ సేవ యజమాని మహమ్మద్ ముక్రమ్ , ఇతరులతో కలిసి తన మీ సేవ సెంటర్ వద్ద,  ఇంటిదగ్గర నకిలీ మీ సేవ సర్టిఫికేట్ లు తయారు చేసి ఇస్తున్నాడని గుర్తించారు. అట్టి సర్టిఫికేట్ లపై సంబందిత రబ్బర్ స్టాంప్ లు వేసి ఒరిజినల్ సర్టిఫికేట్ ల లాగా ఇస్తూ  ఒక్కో సర్టిఫికెట్ కు రూ.5 వేల 10 వేల వరకు వసూలు చేసి పంచుకునేవారు. అట్టి సర్టిఫికేట్లను తీసుకున్నవారు మోసపూరితముగా ప్రభుత్వము నుండి లబ్ది పొందుటకు అట్టి నకిలీ సర్టిఫికేట్ లను ఉపయోగించినరని తెలిసినది. వారిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి ఐదు నకిలీ మీసేవ సర్టిఫికేట్ లు,  ఇప్పటికే తయారు చేసి ఇచ్చిన 22 నకిలీ మీసేవ జనన ధృవీకరణ జిరాక్స్ పత్రాలు , 38  మీసేవ ఖాళీ ఒరిజినల్ సర్టిఫికేట్లు, ఒక రబ్బర్ స్టాంప్, 13 నకిలీ టీసీ, బోనఫైడ్ లు, షాదీ ముబారక్ కు సంబంధించి తయారు చేసిన నకిలీ జిరాక్స్ కాపీలు 1 ,  నకిలీ సర్టిఫికెట్ల తయారీకి ఉపయోగించిన హెచ్ పి ల్యాప్‌టాప్ 1 ,  కలర్ ప్రింటర్ 1, సెల్ ఫోన్ రెండు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మిగతా నిందితుల పై తగు చర్యలు తీసుకొనబడునన్నారు. దర్యాప్తులో బోధన్ పట్టణ సిఐ వెంకటనారాయణ, సీసీఎస్ సిఐ  అజయ్, ఎస్సై  శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్ రాములు, కానిస్టేబుల్ అనిల్, గంగప్రసాద్, బోధన్ ఏసీపీ శ్రీనివాస్, బోధన్ ఎస్సై  రామ్, కానిస్టేబుల్ గంగారం, శివ కృష్ణ సీపీ అభినందించారు.

Mee Seva' center becomes hub for fake certificates.
Mee Seva’ center becomes hub for fake certificates.