700 మంది విద్యార్థులతో ధ్యానం
బతుకమ్మ,ముప్కాల్: ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని పురస్కరించుకొని ముప్కాల్ మండలంలోని రేంజర్ల గ్రామంలో గల విజ్ఞాన్ పాఠశాలలోని 700 మంది విద్యార్థులు శనివారం పది నిమిషాల పాటు ధ్యానంలో కూర్చున్నారు. పాఠశాల ఉపాధ్యాయుడు శ్రీనివాస్ మాట్లాడుతూ ధ్యానంతో మనసుకు ప్రశాంతత, నెమ్మది, సమాధానం మనిషి జీవితంలో కలుగుతాయని దీంతో ప్రతి మనిషి జీవితంలో ప్రతిరోజు ఉల్లాసంగా సంతోషంగా జీవిస్తారని తెలిపారు. ధ్యానం చేయడం వల్ల ఆరోగ్యంగా జీవించవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.