రుద్రూర్, బతుకమ్మ : ఆచార్య బాలకృష్ణ జయంతి సందర్భంగా రుద్రూర్ మండల కేంద్రంలోని యోగా భవనంలో సోమవారం ఔషధ మొక్కల దినోత్సవం (జడిబుడి దివస్) నిర్వహించారు. యోగ భవనంలో యజ్ఞం నిర్వహించారు. అనంతరం యోగ సభ్యులు యోగ భవన్ ఆవరణలో ఔషధ మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో పతంజలి యోగ సమితి తెలంగాణ రాష్ట్ర మీడియా విభాగం ఇంచార్జ్ విశ్వనాథ్ మహాజన్, యోగ ఇన్స్పెక్టర్ డి. సతీష్ గౌడ్ సభ్యులు బెజగం వెంకటేష్, ప్రదీప్, శ్రీనివాస్, కటికే రామరాజు, శివప్రసాద్, బాలరాజ్, సాయిలు, జగన్ గౌడ్, పోశెట్టి, నర్సింలు పాల్గొన్నారు.